Latest Posts

నల్లమాడ మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎంపీపీ సునీతా బాయి, ఎంపీడీఓ అంజనప్ప

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిషత్ కార్యాలయం, నల్లమాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించమైనది . ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎంపీపీ డి. సునీతా బాయి గారు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. అంజనప్ప గారు ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అలాగే మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు కూడా గౌరవ MPDO గారు హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి సేవలు, ఆలోచనలు సమాజానికి దారిదీపంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రసంగకర్తలు పేర్కొన్నారు

Posted Under AP
Editor