Latest Posts

శ్రీకాకుళం – తిరుపతి మధ్య నేరుగా రైలు సర్వీస్: ‘హమ్‌ సఫర్‌’ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా,

హమ్‌‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా మొదటి రెగ్యులర్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రైలును ప్రారంభించారు.

శ్రీకాకుళం జిల్లావాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా మొదటి రెగ్యులర్ రైలు ప్రారంభమైది. హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. రూ.35 కోట్లతో శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేశామని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమైందని తెలిపారు. త్వరలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పూర్తవుతుందని తెలిపారు. ఇక హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి సోమవారం, తిరుపతి నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
గతంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుని శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు నడపాలని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ని కోరారు. వెంటనే స్పందించిన రైల్వేమంత్రి ఈ ప్రతిపాదనలపై అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రెగ్యులర్ రైలును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈక్రమంలో తాజాగా శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతికి రైలు నంబర్‌ 17439/40 హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. ఈ హమ్‌ సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి బయల్దేరుతుంది.. అలాగే ప్రతి సోమవారం శ్రీకాకుళం రోడ్డు నుంచి బయల్దేరుతుంది.

Posted Under AP
Editor