జిల్లా : కర్నూలు
సెంటర్ : ఆలూరు..
ఆలూరు పట్టణంలోని సినిమా ఏరియా వెనుక భాగంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటిలో వంట చేస్తుండగా గ్యాస్ రెగ్యులేటర్ లీక్ కావడంతో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ మహిళకు చేతులు, కాళ్లపై తీవ్ర కాలిన గాయాలయ్యాయి.
పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. సిలిండర్‌లో గ్యాస్ పరిమాణం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇంటిలోని సామానులు, బట్టలు, నగదు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులుగా మారింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదం గురించి స్థానికులు ఎమ్మార్వో గారికి ఇంఫాం చేయడానికి కాల్ చేయగా ఏ ఒక్క అధికారులు కూడా స్పందించకపోవడం గమనహార్థం..
