అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
రాష్ట్ర సిఎం మరియు గవర్నర్ ల కార్యక్రమాలను విజయవంతం చేయండి…
జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్..
అనంతపురం ,ఏప్రిల్ 3:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్ లు ఈ నెల 6 న సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా సమన్వయంతో అధికారులు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్
సి. విష్ణు చరణ్ ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి యాడికి ప్రాంతంలో జలధార కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. అలాగే అదే రోజున స్థానిక జేఎన్టీయూ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరుతున్నట్లు తెలిపారు. పై తెలిపిన ప్రముఖుల పర్యటనలను జిల్లా అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉదయం 9.25 ని”లకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి 10.10ని” చేరుకుంటారు. శ్రీ సత్య సాయి ఏర్పోర్ట్ పుట్టపర్తి నుండి అనంతపురంలోని జేఎన్టీయూ కు రోడ్డు మార్గాన 10.25 ని బయలుదేరి”11.25 ని”లకు చేరుకొని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి పుట్టపర్తి చేరుకుని కాసేపు విశ్రాంతి అనంతరం సాయంత్రం 6.15 గం.లకు పుట్టపర్తి విమానాశ్రయం నుండి తిరుగుప్రయణం కానున్నారని జాయింట్ కలెక్టర్ గౌరవ గవర్నర్ పర్యటన వివరాలను సమావేశంలో వెల్లడించారు.
అధికారులు ఆయా శాఖల ద్వారా అప్పగించిన పనులను పూర్తిస్థాయిలో చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మాలోల, ఎస్ డి సి లు రామకృష్ణారెడ్డి ,రామ్మోహన్, అనంతపురం కళ్యాణ్ దుర్గం ఆర్డీవోలు అన్ని శాఖలజిల్లా అధికారులు పలువురు తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.
