Latest Posts

రమణీయం కణేకల్ శ్రీ చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం…

 

కణేకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చిక్కనేశ్వర స్వామి మహారథోత్సవం ప్రతి సంవత్సరం లాగా చైత్ర పాడ్యమి శుక్రవారం అంగరంగ వైభవంగా అశేష జనవాహిని ఆనందోత్సల మధ్య శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ మహా రుద్రాభిషేకం అర్చన వివిధ అష్టోత్తర పూజ పుష్పార్చనలు నిర్వహించి తదనంతరం బారిక కులస్తులు శ్రీ అబ్బమ్మ ఆలయం నుండి మేళ తాళాలతో బలిహారా అన్నం తీసుకొని వచ్చి రథం ముందు భాగంలో రతంగా ముగ్గు వేసి పూజ నిర్వహించి బలిహారం సమర్పించి శ్రీ చిక్కనేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మహా రథోత్సవము నందు ఉంచి రథోత్సవానికి వివిధ రకాల పూజలు నిర్వహించి మడుగుతేరు లాగారు సాయంత్రం 4:30 నిమిషాలకు అశేష జన వాహిని మధ్య భక్తులు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మేళ తాళాలతో వివిధ రకముల వాద్యములతో ఎదురు బసవన్న దేవాలయం మరియు వీర నాగమ్మ కట్ట వరకు మహా రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడి ప్రజలు స్మరించుకుంటారు. గ్రామపంచాయతీ తరపున అధికారులు స్వామివారికి విశేష పూజలు జరిపించి రథోత్సవానికి పూలమాల సమర్పించి ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు మహారథోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తాదులు మరియు రాజకీయ నాయకులు. ఆంధ్ర తెలంగాణ మరియు కర్ణాటక నుండి వచ్చిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు

Posted Under AP
Editor