Latest Posts

కణేకల్‌లో అంగరంగ వైభవంగా శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం: శివనామస్మరణతో మారుమోగిన పురవీధులు!

అనంతపురం జిల్లా, కణేకల్.

* అంగరంగ వైభవంగా శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం
* వేలాదిగా తరలివచ్చిన ఆంధ్ర, కర్ణాటక భక్తులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి స్వామి వారి బ్రహ్మ రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల కొంగు బంగారంగా, పిలిచిన పలుకే దైవంగా కొలిచే మహిమాన్వితులు శ్రీ చిక్కనేశ్వర స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ప్రతిష్టించి పూజలు, మహా మంగళహారతి చేశారు. మంగళ వాయిద్యాలు, నందికొల్లు సవ్వడులు, డప్పుల మోతలతో ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో పురవీధులలో శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవాన్ని వేలాది మంది భక్తజన సందోహం నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగించారు.
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదములు, అన్న సంతర్పణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు.

Posted Under AP
Editor