తాడిమర్రి(yes9tv) మండలంలోని నిడిగల్లు గ్రామపంచాయతీ ప్రజలకు సర్పంచ్ గోనుగుంట్ల భూషణ్ కృతజ్ఞతలు
సత్యసాయి జిల్లా, తాడమర్రి మండలం, నిడిగల్లు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
03-04-2021 నుండి 02-04-2026 వరకు సర్పంచ్‌గా నా విధులు నిర్వర్తించే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో నా పరిపాలనకు సహకరించిన గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, ఉన్నతాధికారులు, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గతంలో పంచాయతీలకు నిధుల కొరత ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఈ రోజు నా పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా, నన్ను ఆదరించిన నిడిగల్లు గ్రామ ప్రజలకు మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిడిగల్లు గ్రామానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయం అందిస్తానని తెలియజేస్తున్నాను.
నిడిగల్లు గ్రామ ప్రజలకు సర్పంచ్ భూషణ్ కృతజ్ఞతలు: ఐదేళ్ల పదవీకాలం ముగింపు సందర్భంగా భావోద్వేగ ప్రకటన!
