Latest Posts

వింత ఆచారం….. పూజారి కాలితో తంతే మోక్షం..

కర్నూలు జిల్లా… ఆలూరు

మీకు మోక్షం కావాలా? ఐతే ఆ ఆలయానికి వెళ్లాల్సిందే!మీరు అనుకున్న కోరిక కూడా ఇట్టే తీరిపోతుంది… అయితే ఇందుకోసం మీరు ఆలయంలో కి వెళ్లాల్సిన అవసరం లేదు… భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా నిలిచే పూజారితో తన్నులు తింటే చాలు మీకు కచ్చితంగా మోక్షం కలుగుతుంది.. కాలి తన్నులతో మోక్షం వస్తుందా? వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే వాస్తవం! మరి లేట్ ఎందుకు ఈ వింతైన సాంప్రదాయం కొనసాగే గ్రామం ఏది? ఆలయం ఎక్కడ ఉంది?…మనమూ తెలుసుకుందామా. .

అక్కడ భక్తుల నమ్మకం అపారం…ఆయన కాళీ తన్నుల కోసం ఎక్కడి నుండో వచ్చి బారులు తీరుతారు… తన్నుల స్వామి మహిమ తో కోరిన కోరికలు తీరుతాయని వారి బలమైన విశ్వాసం… ఈ కాలి తన్నుల కథ కమామిషు తెలుసుకోవాలన్న, వాటిని కన్నులారా చూడాలనా రాయలసీమ ముఖద్వారం అయినా కర్నూలు జిల్లా కు వెళ్లాల్సిందే

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు…. ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది..మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు ఆయన500 వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది…..ప్రతి ఏటా కర్నాటక లోనే హంపి వీరుపాక్షి స్వామి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతురు లో కూడా అదే తరహాలో మహా యోగి నిర్వహించే వాడని భక్తులు సెలవిస్తున్నారు… అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహా యోగి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారు…ఈ కల్యాణం లో శ్రీ సిద్ద రామేశ్వర స్వామి భక్తులు కొన్నితప్పులు చేయడం తో ఆయన కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట

వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిషులం ను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహం తో నాట్యం చేస్తు భక్తులను తన కాళితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.. అలా స్వామి వారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని…. దాదాపు 500 ఏళ్ల నాటి కి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం ను భక్తి క్రీడను తాము ఇప్పటికి కొనసాగిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు

కల్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో బారులు తీరుతారు.
ఆలయ పూజారి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిషులం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తారు.వరస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్ను కొంటు వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామి వార్లకు పూజలు నిర్వహించి అక్కడినుంచి వెళ్ళిపోతారు..తమకు మోక్షం జరుగు తుందనే బలమైన నమ్మకం అక్కడ భక్తుల్లో నెలకొని ఉంటుంది…

పూజారి తన్నుల సేవా కార్యక్రమ0 ముగిసిన తరువాత స్వామి వార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు… స్వామి వార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకొన్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకొంటారు ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం నేటికి కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి గ్రామస్తులు…

Posted Under AP
Editor