Latest Posts

అలూరులో అంబరాన్నంటిన అమరావతి సంబరాలు: భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. రాజధాని అమరావతి అమలు దిశగా పార్లమెంట్ చట్టసభలో నిర్ణయం వెలువడటంతో టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కూటమినేతలతో కలిసి బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై అమరావతి , జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాజధాని లేక ప్రజలను ఇబ్బందులకు గురయ్యారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి వద్దు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తానని, స్వచ్ఛందంగా అమరావతిలో 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను , మహిళలను అరెస్టులు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని
అలాగే, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు రాకుండా కంపెనీ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో అమరావతి చట్టబద్ధంగా ఆమోదం జరగడం ఆంధ్ర ప్రజల్లో పండగ వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు . ఈ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి దక్కిందని తెలిపారు మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి సహకరించిన దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలుపారు. అమరావతిని వ్యతిరేకిచ్చిన భారత దేశంలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాద్‌తో పాటు బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor