Latest Posts

“అమరావతి చట్టబద్దం చరిత్రాత్మకం – ఇక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేరు”: ..

“అమరావతి చట్టబద్దం చరిత్రాత్మకం – ఇక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేరు”: ..

అమరావతి రాజధాని బిల్లుపై రాజ్యసభలో ఆమోదింపు పొందిన నేపథ్యంలో గురువారం సాయంత్రం కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో టీడీపి,బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పట్టణం లోని ఆర్ అండ్ బి వసతి గృహం నుంచి బైక్ ర్యాలీ ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గౌ శ్రీ ఏం.ఎస్.పార్థసారథి గారు,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ గారు జెండా ఊపి బైక్ ర్యాలీ ని ప్రారంభించారు జాతీయ జెండాను, కూటమి పార్టీల జెండాలను చేతపట్టి అంబేద్కర్ సర్కిల్, జీవన్ సర్కిల్, జ్యోతిరావు పూలే సర్కిల్, టవర్ క్లాక్, మీదుగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు..

ఈ సందర్భంగా అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి , యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారికి, అమరావతి రాజధానికి అన్ని విధాల సహకారం అందిస్తూ ఈనాడు రాజధాని చట్టబద్ధత బిల్లును సత్వరమే ఆమోదించేలా చర్యలు చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి బిజెపి పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి తరుపున కూటమి నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధం చేసిన గౌరవనీయులైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి తదితర కూటమి నాయకులకు YES9 టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

Posted Under AP
Editor