Latest Posts

మైనర్ డ్రైవింగ్ పై ఎస్ ఐ హెచ్చరిక

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ద్విచక్ర వాహనంపై త్రిపుల్ రైడింగ్ చేస్తున్న మైనర్లకు నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గురువారం 10వ తరగతి పరీక్షల ముగింపు సందర్భంగా పరీక్ష కేంద్రానికి తనిఖీకి వచ్చిన ఎస్సై సతీష్ కుమార్ త్రిబుల్ రైడింగ్ చేస్తున్న మైనర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. త్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల అనర్ధాలు, హెల్మెట్ లేకుండా జరిగే ప్రమాదాల గురించి యువకులకు వివరించారు. వారి తల్లిదండ్రులకు శరవాణిలో తెలిపి ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా పిల్లలకు తెలియ చెప్పాలన్నారు.

Posted Under AP
Editor