ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము అంగరంగ వైభవంగా, వేలాదిమంది భక్తుల నారాయణ అనే నామస్మరణ మధ్యన కోలాహలంగా విజయవంతంగా సంబరంగా ముగిసినందున సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తి లత్తవరం గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప గారు, గ్రామ నాయకులు,కొర్రపాటి మల్లికార్జున, గారు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజలు, పాల్గొన్నారు.
వైభవంగా లత్తవరం లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం: భక్తుల నామస్మరణతో మారుమోగిన కొండప్రాంతం
