అనంతపురం జిల్లా, ఉరవకొండ.
02.04.2026.
*పెన్నఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
– *ఉరవకొండ మండలం పెన్నఅహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదఆశీర్వాదం, తీర్థప్రసాదాలను మంత్రికి ఆలయ అర్చకులు అందజేశారు. తదనంతరం ఆలయ పరిసరాలను, కోనేరును మంత్రి పరిశీలించారు.*
– *ఆ తరువాత పెన్నఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆయా శాఖల అధికారులతో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు.*
