జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అన్ని ఆపద్దపు మాటలే .
పవన్ కళ్యాణ్ గారిపై , కూటమి ప్రభుత్వం పై మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డి కి లేదు .
YSR ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ 25 వ స్థానంలో ఉన్న శాఖను 1వ స్థానం కి తీసుకు వచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే.
జగన్ మోహన్ రెడ్డి కి మతి భ్రమించి పేర్లు పిచిపోలేదు అందుకే జగన్ పేరు ఉండేలా MAVIGUN అని రాజధానికి పేరు పెట్టాలని ఆలోచన .
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్ట భద్రత కల్పించే బిల్లు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినందుకు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి, రాష్ట్రం ముఖ్య మంత్రి చంద్రబాబు గారికి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఇన్చార్జి గౌతమ్ కుమార్ .
నియోజకవర్గం ఇంచార్జి గౌతమ్ కుమార్.
* గౌతమ్ కుమార్ మాట్లాడుతూ హింసించేరాజు 23వ పులకేశి అని ఒక తమిళ డబ్బింగ్ సినిమాలో వడివేలు హీరో ఆ సినిమాలో వడివేలు తీసుకునే పిచ్చి నిర్ణయాలకు అతడితో పాటు అతడి రాజ్యం కోసం ప్రతిసారీ చిక్కుల్లో పడుతుంది. ప్రజల ముందు తలదించుకోవల్సి వస్తుంది. జగన్ కూడా సేమ్ వడివేలు క్యారెక్టర్ కి సీక్వెల్ లాంటివాడనీ . 24వ పులకేశి. ప్రజలను హింశిస్తున్నాడనీ ఈ ఆంధ్రా పులకేశిని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా బుద్ధి మారలేదనీ అన్నారు.
* నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి Y S జగన్మోహనరెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం అవాస్తవాలే పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న అమరావతిపై జగన్ మోహన్ రెడ్డి భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడి తనకేమైనా అనుమానాలు ఉంటే అసెంబ్లీలో ప్రశ్నించాల్సింది పోయి… అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. రాష్ట్రానికి రాజధాని అనేదే రాజ్యాంగంలో లేదంటాడు. తను మూడు రాజధానులు ఏర్పాటు చేశానంటాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లను కలిపి మావిగన్ పేరుతో ఏర్పాటు చేయవచ్చు కదా అని సలహా ఇస్తారు. ఈయన తీరు చూస్తుంటే మతిస్థిమితం కోల్పోయి లేనట్టు ప్రజలకు అర్తం అవుతుంది.
* పవన్ కల్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన పంచాయతీలను నిలిపే కృషి చేసి పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో వచ్చిన ఐదు అవార్డులు జగన్ కు కనిపించడం లేద ? జనసేన అధినేత పవన్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తూ ప్రెస్మీట్ పెట్టడానికే బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చే జగన్ పవన్ కల్యాణ్ గారిపై కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. అయ్యా జగనూ నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నమ్మరు. కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారు.
* వైసీపీ విధానం రాజధాని విషయంలో మొదటి నుంచి సరిగా లేదని సిద్ధాంతం గానీ, స్పష్టత గానీ, విధానం గాని లేని పార్టీ అని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, రాష్ట్రంలో అభివృద్ది లేకుండా అరాచకం జరగాలనేది ఆ పార్టీ కాన్సెప్ట్. బాప్ ఏకీ హే బేటా దస్ నంబర్ హే అనేలా… ఆ పార్టీ నాయకుడి ఆలోచనే ఆ పార్టీ నేతలకు ఉంటుంది. విధ్వంసం, అశాంతిని మాత్రమే ఆ పార్టీ బలంగా కోరుకుంటుంది.
* అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి అయిదేళ్లు సెట్లు వేసుకొని అదే పాలన అని, బటన్లు నొక్కడమే సంస్కరణలు అని అనుకున్న వారికి రాజధాని విషయంలో పెద్ద కలలు ఉండాలని అనుకోవడం భ్రమ. వైసీపీ పాలలో ఒక స్థిరమైన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పరచకుండా ఐదు కోట్ల ఆంధ్రులని మోసం చేశారు. అధికారం పోయాక ఇప్పుడు మూడు అభివృద్ధి రీజియన్లు, ప్లాన్ బి అంటూ MAVIGUN అనే కొత్త పాట పాడుతున్నారు. ఈ మూడు ముక్కలాట విధానం… రాత్రి ఏ పబ్ జీ గేమ్ లో చూశాడో మళ్లీ మొదలుపెట్టాడు. మావిగన్ అంటే ఏదో గేమ్ పేరులా ఉంది.
* కూటమి ప్రభుత్వం కూడా రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనికి తగిన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. 2024లో మూడు ముక్కలాట ఆడిన జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా ఆయన బుద్ధి మారలేదు.
* అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర తగిన విధంగా సహకరిస్తోంది. అమరావతి ప్రాధాన్యతనను కేంద్రం గుర్తించింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రౌండింగ్ చేశాం. బడ్జెట్ లో అమరావతికి తగని ప్రాధాన్యం ఇస్తూ అమరావతి పనులు వేగం పుంజుకోవడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలను భయపెట్టేలా, పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొల్పేలా మరోసారి మూడు రీజియన్లు అంటూ నాటకం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే.
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు చేస్తున్నారు అని జగన్ ఆరోపిస్తున్నారు… పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు.. ఎక్కడ ఉంటున్నారో.. ఎలా పాలన చేస్తున్నారో జగన్ ఒకసారి పరిశీలిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు అర్థం అవుతుంది. 25వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ను ఒకటో స్థానానికి తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. కనీసం సచివాలయానికి కూడా వెళ్లకుండా సెట్లు వేసి పరిపాలన చేసిన మీరు.. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి మాట్లాడే అర్హత జగన్ ది కాదు గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి ఏ మంత్రి ఉండేవారో కూడా తెలియని పరిస్థితి నుంచి గర్వంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి శాఖగా చెప్పుకొనే పనులు చేశారు. సంస్కరణలు తెచ్చారు. గ్రామీణ వికాసానికి దారి చూపుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ముందుచూపు, ఆయన ఆలోచనలు అత్యుత్తమమైనవి. అవి ఆకాశం లాంటివి.. దాని మీద ఉమ్మి వేస్తే అది తిరిగి మళ్లీ జగన్ మీదనే పడుతుంది. జాగ్రత్త..
* మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి, గిరి పుత్రుల బాధలను అర్థం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. డోలి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ అడవి తల్లి బాట పేరుతో బ్రహ్మండంగా అభివృద్ధి చేస్తున్నారు. Press meet అవగానే బెంగళూరు వెళ్ళిపోయే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు..??
* అమరావతికి వైసీపీ వ్యతిరేకం అని ప్రజల ముందు చెప్పండి. అంతేగాని లేనిపోని కారణాలు చెప్పి పార్లమెంట్లో రాష్ట్ర రాజధాని బిల్లుకు మద్దతు ఇవ్వకకపోవడం వైసీపీ కుట్రపూరిత ఆలోచనలకు ప్రతిరూపం.
* జగన్ రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అని చెప్తున్నారు.. మీ హయాంలో మరి మూడు రాజధానులు అని ఎలా అన్నారు…?.
* అధికారంలో ఉన్నప్పుడు సొంత పేర్లు పథకాలకి, ఊర్లకి, ప్రభుత్వ కార్యక్రమానికి పెట్టుకున్న మీరు రాజధాని విషయంలో కూడా మీ పేరు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా పేర్లు పిచ్చి పోలేదు. అంతగా పిచ్చి ఉంటే మీ ఇంటికి జగన్ జంగిల్ అనిపెట్టుకోండి.
* ఈ పేర్లు పిచ్చి, రంగులు పిచ్చి మీకు ఎప్పటికీ పోదు. వైసీపీకి ప్రజలు 11 ఇచ్చినా బుద్ధి రాలేదంటే… మరోసారి దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించి… అవి ఇవ్వడం కూడా వృధా అనేలా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తీర్పు ఇస్తారు అని తెలియచేశారు.
