ముదిగుబ్బ ఏప్రిల్ 2:
ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో తలెత్తే అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించి, భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సరిహద్దు రాళ్ల ఏర్పాటు, రికార్డుల నమోదులో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
