Latest Posts

ముదిగుబ్బ సచివాలయం-2ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

 

మండల కేంద్రంలోని సచివాలయం-2ను శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను, బయోమెట్రిక్ హాజరును మరియు సేవల వితరణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, గడువులోగా (SLA) సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు.సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సచివాలయ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor