రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
– ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతి కోసం ఎన్నో సంవత్సరాలుగా సాగిన రైతుల త్యాగం, ప్రజల ఆకాంక్షలు ఈ రోజు పార్లమెంట్ వేదికగా న్యాయం పొందాయి.
– పార్లమెంట్‌లో జరిగిన ఈ చర్చలో సహచర ఎన్డీఏ ఎంపీలతో కలిసి ఎంపీ అంబికా పాల్గొన్నారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర భవిష్యత్తు గురించి సభ్యులు వివరించారు. ఈ బిల్లుకు పలు పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వడం ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా నిలిచింది.
– ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
– అమరావతిని రాజధానిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పమే ఈ విజయానికి కారణం. ఈ బిల్లు తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమరావతి బిల్లుకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల ఎంపీలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
– అమరావతి కోసం తమ భూములను ఇచ్చి త్యాగం చేసిన రైతులందరికీ నా వందనాలు. వారి ఆశయాలు ఈ రోజు నిజమయ్యాయి.
– రాష్ట్ర రాజధానిగా అమరావతి అజేయం. ఇకపై ఎవరూ అమరావతిని కదిలించలేరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయం.
