అనంతపురం జిల్లా.
*ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం చేయూత ఎప్పటికీ ఉంటుంది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు *
ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో మాంచూ ఫెర్రర్ గారితో ఆత్మీయ కలయిక
*రెన్యువల్ కోసం కృషి చేసిన మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.. పూల నాగరాజు
ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం చేయూత ఎప్పటికీ ఉంటుందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టిసి జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు స్పష్టం చేశారు. ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ అయిన నేపథ్యంలో పూల నాగరాజు గారు ఆ సంస్థ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ గారిని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారు, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు ఆర్డిటి ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాంచు ఫెర్రర్ గారిని పూల నాగరాజు గారు సత్కరించారు. మీ సహకారం ఎప్పటికీ మరువలేమని మాంఛో ఫెర్రర్ గారు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్డీటీ కోసం తమ వంతుగా స్పందించారన్నారు. ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ ఆర్డీటీ అందించిన సేవా కార్యక్రమాలు జిల్లాలో కొన్ని లక్షల కుటుంబాలకు చేరాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారన్నారు. ప్రతి ఏటా 6వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించి..ఉన్నత శిఖరాలకు చేర్చారన్నారు. అలాగే ఆసుపత్రిల ద్వారా ప్రతి ఏటా లక్షల మందికి సేవలందిస్తున్నారన్నారు. క్రీడా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలు నిర్మించి.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీశారన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ గారు ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఎ రెన్యువల్ కోసం కృషి చేశారన్నారు. నారా లోకేష్ గారి కృషిని ఎప్పటికి మరువలేమని పూల నాగరాజు గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తవలిల సంఘం అధ్యక్షుడు షకిల్ షఫీ గారు, టిడిపి రాష్ట్ర నాయకుడు కొండవీటి సుధాకర్ నాయుడు , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి , జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్ , మాజీ ఎంపిపి ప్రతాప్ , టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి తాజుద్దీన్ , జిల్లా మీడియా కోఆర్డినేటర్ దబ్బర కుమారస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
