అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.
బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే తపనతో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు.
చదువుకునే రోజుల్లోనే పార్టీ జెండా పట్టుకు తిరిగానని, ఆనాడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో అణగారిన వర్గాలైన బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం, ఢిల్లీ నుండిబొడ్డున తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానాన్ని గుర్తించి అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలుగువాడి క్యాతిని దశ దిశల వ్యాపింప చేయడమే కాకుండా ఢిల్లీలో తెలుగు వారిని మద్రాసియులు అని పిలిచే పదాన్ని కూడా మార్చి తెలుగు వారు అని పిలిచేలా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని అది కేవలం అన్న ఎన్టీఆర్ ఘనత అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలసి అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేక మంది సామాన్యులను సైతం నాయకులుగా తీర్చిదిద్దిందని, నేడు ఏ పార్టీలో చూసిన టీడీపీలో నాయకులుగా ఎదిగిన వారే ఉన్నారని అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు..టీడీపీ అంటేనే నాడు అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్థాపించగా నేడు అదే పంథాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ సహకారంతో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు కొనసాగిస్తున్నారని అన్నారు..
