Latest Posts

కళ్యాణదుర్గం హత్య కేసులో కీలక మలుపు: పాతచెరువులో బయటపడిన ఎముకల గూడు.. నాలుగు నెలల తర్వాత వెలుగులోకి భార్య దారుణం!

  • అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.
  • బాడీ మిస్టరీ గా మారిన హనుమంతు శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీత.
  • బయట పడిన ఎముకల గూడు ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలింపు.
  • తల్లికూతరు గొడవతో ఆలస్యంగా హత్య కేసు వెలుగులోకి.
  • పూడ్చిపెట్టిన స్థలాన్ని కొడుకు చుపియడంతో కేసులో కీలక మలుపు.

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం పాతచేరువు గ్రామంలో హనుమంతు హత్య కేసు సంచలనం రేపుతోంది. నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో బాడీ మిస్టరీ గా మారిన శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీశారు. హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన స్థలాన్ని మృతుడి కొడుకు సందీప్ చూపించడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. జిల్లా మెడికల్ ఆఫీసర్ హెచ్ఓడి శంకర్ నాయక్ తహసీల్దార్ భాస్కర్ సమక్షంలో తవ్వకాలు చేపట్టగా ఎముకల గూడు బయటపడింది. అనంతరం వాటిని ఫారెన్సిక్ పరీక్షల కోసం తరలించారు.ప్రాథమిక సమాచారం మేరకు గత ఏడాది నవంబర్ 10న తెల్లవారుజామున భార్య సుకన్య రోకలితో మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. హత్య అనంతరం శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది.ఇటీవల తల్లి–కూతుళ్ల మధ్య జరిగిన గొడవతో ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఫారెన్సిక్ ల్యాబ్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడతాయని వెల్లడించారు.

Posted Under AP
Editor