Latest Posts

ఉరవకొండలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు!

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఉరవకొండ పట్టణం టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చేసిన ఉరవకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు,తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor