తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా కదిరి పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్న మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు కూటమి శ్రేణులకు YES9 టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
కదిరిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్!
