Latest Posts

హెచ్‌ఎల్సీ (HLC) ఆధునీకరణలో ప్రభుత్వం విఫలం: ఏప్రిల్ 23న అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి సిపిఐ పిలుపు!

అనంతపురం జిల్లా, బొమ్మనహళ్.

*శిథిలావస్థకు చేరిన హెచ్ ఎల్ సి కెనాల్ ను బొమ్మనహాళ్ మండలం 105 కిలోమీటర్ డిస్ట్రిబ్యూటర్ కాలువ వద్ద నుండి కణేకల్ చెరువు డిస్ట్రిబ్యూటర్ కాలువల వరకు పరిశీలించిన సిపిఐ బృందం*

*ఆధునికరణ పనులను చేపట్టాలని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపిఐ అనంతపురం జిల్లా బృందం*

*హెచ్ ఎల్ సి కెనాల్ ను శిథిలావస్థకు చేరిన డిస్ట్రిబ్యూటరీ కాలువలను* *ఆధునికరణ పనులు చేపట్టాలని*
*సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవరగుడిజగదీష్ పిలుపునిచ్చారు*

*ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ మాట్లాడుతూ*

శిథిలావస్థకు చేరిన తుంగభద్ర హైలెవెల్ మెయిన్ కెనాలును ఆధునీకరణ చేయాలి.
తుంగభద్ర జలాశయం నుండి అనంతపురము జిల్లాకు 32.5 టి.యం.సిలు నీరు రావాల్సి వుంది. సుమారు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వవలసివుంది.

హై లెవల్ మెయిన్ కెనాల్ (HLC) శిథిలావస్థకు చేరింది. కాలువ ప్రక్చర్లు, డిస్ట్రిబ్యూటరీస్ గేట్లు, పిల్లకాలువలు పూర్తిగా దెబ్బతిని, తుమ్మితే ఉడిపోయే ముక్కు మాదిరిగా తయారైనాయి. అందువల్ల కర్ణాటక నుండి అనంతపురము జిల్లా సరిహద్దు వరకు 4 వేల క్యూసెక్కులు నీరు ప్రవహిస్తావుంటే, 105 కిలోమీటర్ జిల్లా నుండి కాలువలో రెండు వేల క్యూసెక్కులు వదిలితే కాలువకు గండ్లుపడి నీరు వృథా అవుతున్నది. రంధ్రాలలోకి నీరు పోతుంటే ప్రభుత్వలు పట్టించుకోక
పోవడం దుర్మార్గం త్వరితగతిన హెచ్ ఎల్ సి కెనాల్ ప్రారంభించక పోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు.

*సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి మాట్లాడుతూ*

హెచ్ ఎల్ సి కెనాల్ ఆధునికరణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది ప్రతిచోట కాలవలు గండ్లు పడి మట్టి తీయకపోవడం కెనాల్ విరగబడిన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడం వల్ల మీరు సక్రమంగా రైతులకు పంట పొలాలకు అందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అధ్వాన్నమైన పరిస్థితివల్ల మన జిల్లాకు 24 టి.యం.సిలు కూడా రావడం లేదు. వస్తున్న నీటిలో తాగునీటి అవసరాలకే 11 డి.యం.సె తుంగభద్ర నీరు ఇవ్వాల్సి వుంది. ఇలాంటి పరిస్థితులలో జిల్లాలో 70 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పంట పొలాలకు ఇస్తున్నారు. ఈ సాగునీరు కూడా పంటలకు అదను తప్పి ఇస్తున్నారు. చివరి ఆయకట్టు పొలాలకు తుంగభద్ర నీరు పోవడం లేదు.

ఈ దుస్ధితి వల్ల తాడిపత్రి ఆయకట్టు 31వేల ఎకరాలకు, అలూరు బ్రాంచి కెనాల్ ద్వారా 14వేల ఎకరాలకు గుంతకల్ సబ్ బ్రాంచ్ కెనాల్ నుండి 16 వేల ఎకరాలకు తుంగభద్ర నీరు ఇవ్వడం లేదు. అతుకుల బొంత మాదిరి కృష్ణా బేసిన్ లోని నీరు అడపాదడపా ఇస్తున్నారు.

రాయదుర్గం తాలూకాలో ఉంతకల్లు రిజర్వాయర్ను నిర్మించి, హైలెవల్ కెనాల్ ద్వారా 5 టి.యం.సిల నీరు నిల్వ చేయాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వము నిర్ణయించినది. దీని సర్వేకు గాను 3 కోట్ల 70 లక్షణ కావాలి. ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. సర్వేను జరగలేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని త్వరితగతిన హెచ్ఎల్టి కెనాల్ ఆధునీకరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఏప్రిల్ 23న జిల్లావ్యాప్తంగా రైతులను ఏర్పాటు చేసుకొని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు.

*సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి. అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ*

కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అత్యంత ప్రాధాన్యమైనటువంటి హెచ్.ఎల్.సి కెనాల్ వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అందువల్ల కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరిన బ్రిడ్జ్లు డిస్ట్రిబ్యూటర్ కాలువలు విరిగి పడుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని ఆధునికరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలం చెందింది. త్వరితగతిన ఆధునికరణ పనులు చేపట్టాలని రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని తెలియజేశారు. అదేవిధంగా
హైలెవల్ మెయిన్ కెనాల్ ఆధునీకరణ చేయుటకు 453 కోట్లతో 6 ప్యాకేజీలు టెండర్లు కూడా పిలిచినారు. ప్రభుత్వం నిధులు ఇవ్వనందువల్ల గుత్తేదారులు పనులు చేయలేదు.

105 కిలోమీటరు నుండి 189 కిలోమీటరు వరకు ఈ HLC ని ఆధునీకరణ చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇద్దరు పాదయాత్రలు కూడా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా తుంగభద్ర HLC కెనాల్ ఆధునీకరణను విస్మరించినారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటకుగాను మండలాల యందు. జరిగే రైతు సదస్సుల యందు యావన్మంది రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము. అన్ని మండలాల యందు రైతు సదస్సులు జరిపిన పిదవ ఏప్రిల్ 23 వతేది గురవారం ఉదయం 10-00 గం||ల నుండి అనంతపురము కలెక్టర్ ఆఫీసు ముందు వేలాది మంది రైతులతో పెద్ద ఎత్తున ధర్నా జరుగును. అన్ని ప్రాంతల రైతు సోదరులు 23న అనంతపురమునకు వచ్చి ధర్నాను జయప్రదం చేయాలని తెలియజేశారు.

*అనంతపురం జిల్లా సిపిఐ బృందం HLC కెనాల్ డిమాండ్స్*

1). తుంగభద్ర హైలెవల్ కెనాల్ను ఆధునీకరణ చేయుటకు 453 కోట్ల నిధులు మంజూరు చేయాలి.

2) HLC కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలి.

3) HLC కెనాల్ నుండి PABR కు నీరు వదిలే మోపిడి, కెనాల్ తూముని వెడల్పు చేయాలి.

4) ఉంతకల్లు రిజర్వాయర్ సర్వే చేసి పనులు చేపట్టాలి.

5) కాలువ గట్లు డిస్ట్రిబ్యూటరీల తక్షణ మరమ్మత్తులకు గానూ వందకోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని. ఈరోజు బొమ్మనహాళ్ మండలం 105 కిలోమీటర్ల HLC గేటు వద్ద శిథిలావస్థకు చేరిన డిస్ట్రిబ్యూటర్ కాలువలను హెచ్ ఎల్ సి కెనాల్ ను మరమ్మతులు చేయాలని. కనేకల్ చెరువు పరివాహక సంబంధించినటువంటి హెచ్ ఎల్ సి కెనాల్ 1964లో ఆక్వా రోడ్ ఏర్పాటైనది ఇప్పుడు అది పూర్తిస్థాయిలో శిథిలావస్థకి చేరిన సందర్భాలు ఉన్నాయి. హెచ్ ఎల్ సి నీరు విడుదల అయితే ఒక్కసారి దెబ్బదింటే అనంతపురం జిల్లా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఆ కాలువపై వెళ్లకూడదని అధికారులు ఆంక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. హెచ్ ఎల్ సి లో ఆధునికరణ పనులు చేయకపోవడం వల్ల. రేపటి రోజున రైతులు తీవ్రస్థాయిలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. బొమ్మణహాల్ మండలం 105 కిలోమీటర్ల గేటు నుండి కనేకల్ చెరువు పై మాల్యం నుండి నింబగల్లు వరకు క్షేత్రస్థాయిలో సిపిఐ అనంతపురం జిల్లా బృందం పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాయదుర్గం తాలూక కార్యదర్శి నాగార్జున సహాయ కార్యదర్శి గౌస్
ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సర్మస్
రాయదుర్గం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి
ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కావలి కోట్రేష్
ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు
నాయకులు దుర్గన్న ఓభన్న తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor