Latest Posts

కళ్యాణదుర్గంలో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మిక తనిఖీ: ఏపీఐఐసీ భూముల పరిశీలన.. పారిశ్రామికాభివృద్ధికి 5 వేల ఎకరాల గుర్తింపుకు ఆదేశం!

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.

*తిమ్మసముద్రం వద్ద ఏపీఐఐసీ భూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

అనంతపురం, మార్చి 28 :

– *కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామం వద్దనున్న ఏపీఐఐసీ భూములను శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రో బేస్ (Astro Base) సంస్థ వారి పురోగతిని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఎంఎస్ఎంఈలో జరుగుతున్న సిసి రోడ్లు మరియు సిసి డ్రైన్ల పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో పారిశ్రామిక పురోభివృద్ధికి మరొక ఐదు వేల ఎకరాలు అవసరమని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కి జిల్లా కలెక్టర్ సూచించారు. ఐడెంటిఫికేషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్.వి.ఎస్.ఎస్.నాగకుమార్, జి.ఎం డి.ఐ.సి. శ్రీనివాసయాదవ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇంజనీరింగ్ దేవకాంతమ్మ, మేనేజర్ రవితేజ, ఈఆర్పీ సాయి సాగర్, ప్రాజెక్టు ఇంజనీర్ విశ్వం, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఇంజనీర్ వెంకటేశ్వరరావు వర్క్ ఇన్స్పెక్టర్ షఫీ కలందర్, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor