Latest Posts

పుట్టపర్తి పప్పూరి సేవలు చిరస్మరణీయం: జయంతి వేడుకల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ నివాళి

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

“పప్పూరి సేవలు చిరస్మనీయం”

జాయింట్ కలెక్టర్
సి.విష్ణు చరణ్

అనంతపురం, మార్చి 28:

స్వాతంత్ర ఉద్యమంలో సరస్వతి పుత్రుడైన డా.పద్మశ్రీ పుట్టపర్తిపప్పూరునారాయణాచార్యులుచేసినసేవలుచరిత్రలోచిరస్మనీయంగానిలుస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కీ “శే” నారాయణ చార్యులు జయంతి వేడుకలుయువజన సంక్షేమం, ఆన్ సెట్ మరియు టూరిజం శాఖ ల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ
పుట్టపర్తినారాయణచార్యులు బహుభాషా కోవిదుడని, వీరు జాతికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమన్నారు. ఆనాడు భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు పాల్గొనడం జరిగిందని అందులో పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా తనదైన శైలిలోదేశస్వాతంత్రం కోసం తన వంతుగా సేవలందించి కీలక పాత్ర వహించారన్నారు. 1914 సంవత్సరం మార్చి 28న మన అనంతపురంజిల్లాఅనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో తండ్రి శ్రీనివాసాచార్యులు తల్లి కొండమ్మ అనే ఆదర్శ దంపతులకు జన్మించడం జరిగిందన్నారు.
తల్లి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితురాలు అయిన నేపథ్యంలో పప్పూరి సాహిత్యం పట్ల ఆకర్షితులై అనేకరచనలురచించారన్నారు. శ్రీకృష్ణదేవరాయల రాజ గురువు కాగా తిరుమల తాతాచార్యుల వంశం వారిద న్నారు. అంతేగాకతాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడని ఆ వంశస్థులు పుట్టపర్తి లోని చిత్రావతి తీరంలో ఉండడంవల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయినట్లు చరిత్ర ద్వారాతెలియవచ్చిందన్నారునారాయణ చార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నట్లు తెలిపారు ముఖ్యంగా వదరుబోతు రచనలతో స్వాతంత్ర ఉద్యమంలో సాహితీ రంగానికి రామాచార్యులు చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. మునిసిపల్ చైర్మన్,ఎమ్మెల్యేగా, సింహాచలం దేవస్థానం బోర్డు నెంబర్ గా సేవలందించారని డాక్టర్ నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు బళ్లారి రాఘవ లాంటి ప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని జాయింట్ కలెక్టర్ గుర్తు చేశారు. 1990 సెప్టెంబర్ 1న పప్పూరి నారాయణ చార్యులుస్వర్గస్తులయ్యారన్నారు.
జాతికి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఆయన జయంతినినిర్వహించుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎ.మాలోల డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ ,ఆన్ సెట్ ఇంచార్జి మేనేజర్ సి.శ్రీనివాసులు గారు, యువజన సంక్షేమ శాఖ సూపరిటండెంట్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor