అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
*పాలవాయి గ్రామంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”*
– *: కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
– *: ప్రజలు తమ ఇళ్లలోనే చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్*
అనంతపురం, మార్చి 28 :
– *కళ్యాణదుర్గం మండలంలోని పాలవాయి గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించగా, ఇందులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జడ్పి సిఈఓ జి.శివ శంకర్, డిపిఓ టి.నాగరాజ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులు మరియు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చలివేంద్రంను ప్రారంభించారు. ఇందులోభాగంగా గ్రామ పంచాయతీ నుంచి సభా స్థలం వరకు ర్యాలీగా వెళ్ళి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థులు తమ ఇళ్లలోనే చెత్తను తడి – పొడి వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకునేలా ప్రోత్సహించడమే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.*
– *జిల్లాలోని ప్రజలకి త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియచేశారు. గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైన పక్షంలో గ్రామ మరియు మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాని పక్షములో, ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించగలరని, జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయ సిబ్బంది బి.మదన్ మోహన్ ఫోన్ నంబర్ 9550480972 కు ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.*
– *ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం సందర్శించి వాటి ఉపయోగాలు, వాటిని వాడుకోవాల్సిన విధి విధానాలను ప్రజలకి తెలియచేశారు. అలాగే ప్రజలు అందరూ ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.*
– *మండలంలోని అన్ని గ్రామాలలో ఉత్పత్తి అయ్యే ముఖ్యంగా పొడి వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్తను సేకరిస్తూ వాటికి బదులుగా తగిన నగదుకు నిత్యావసర సరుకులు అందచేశారు.*
*వర్లి గ్రామ పంచాయతీలో స్వామిత్వ సర్వే పరిశీలన :*
– *అలాగే జిల్లాలో స్వామిత్వ సర్వేకు సంబంధించి కళ్యాణదుర్గం మండలంలోని వర్లి గ్రామ పంచాయతీలో స్వామిత్వ సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్వామిత్వ సర్వే ఎలా జరుగుతుందో ప్రజలకి వివరించి, స్వామిత్వ సర్వే సక్రమంగా కొనసాగాలని జిల్లాలోని అందరు పంచాయతీ కార్యదర్శులును మరియు జిల్లాలోని అందరూ మండల సర్వేయర్స్ ను మరియు గ్రామ సర్వేయర్స్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపిడిఓ, డిప్యూటీ ఎంపీడీవో రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి అలివేలమ్మ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.*
