Latest Posts

కర్నూలులో దివ్యాంగ ఉద్యోగుల సంఘం కార్యాలయం ప్రారంభం

📍కర్నూల్..

*దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన కర్నూల్ జిల్లా దివ్యాంగుల కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు..*

❇️కర్నూల్ పట్టణంలో “కర్నూలు జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం & విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ కార్యాలయం” ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు పాల్గొన్నారు.

❇️కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం నారా లోకేష్ గారు విడుదల చేసిన “జాబ్ క్యాలెండర్ – 2026” సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించి, కూటమి పెద్దలకు పాలాభిషేకం చేసిన చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు.

❇️ఈ కార్యకరమంలో చైర్మన్ గారితో పాటు విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ అధ్యక్షులు బోయ రామాంజనేయులు గారు, జనరల్ సెక్రటరీ ఎం. మనోహర్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, జనరల్ సెక్రటరీ కె. లక్ష్మీనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ బండారు దుర్గారావు గారు, కర్నూలు జిల్లా సంఘం అధ్యక్షులు కే. నాగరాజు గారు, జనరల్ సెక్రటరీ పి. భాషా గారు, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ గారు, దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు ఎ. మురళి గారు, విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బ నరసారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

❇️ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో దివ్యాంగులు హాజరై విజయవంతం చేశారు.
.
.
.
#Kurnool
#Chairman_Gaduputi_Narayanaswamy
#TeamNaraLokesh
#DivyangAssociation
#APJobCalender2026

Posted Under AP
Editor