వైద్యంతో వ్యాపారం వద్దు.
……… …….. .
ఉదిరిపికొండ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి.
………… వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అందుకే మన పెద్దలు వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడిని శ్రీమన్నారాయణుడితో పోల్చారు. సాక్షాత్ శ్రీమహావిష్ణువు తో పోల్చబడ్డ వైద్యం వ్యాపారం కాకూడదని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అన్నారు. ఆదివారం ఉదిరిపి కొండ గ్రామంలో జరిగిన రైతు టీవీ ఉచిత వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనకు కోట్లాది రూపాయల ఆదాయం, ఆస్తి ఉన్నా తాను పేదలకే ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. తన పేరుకు ముందు పది రూపాయలు డాక్టర్ గా తనకు మరొక పేరు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. నలుగురిని నడిపించు నాన్నా అన్న తన తండ్రి మాటలు తనకు వేదంలా గుర్తుకొస్తాయని, తన తండ్రి చూపిన బాటలోనే నడుస్తున్నానన్నారు. వైద్యం అంటే ఓపిక వైద్యం అంటే వ్యాపారం కాదు తనకు ఓపిక ఎంతో ఉందని ఎంతమంది పేదలు తన వద్దకు వచ్చినా ఎంతో ఓర్పుతో వారి సమస్యలను పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో పది రూపాయలకు వైద్యం అందిస్తూ పదిమంది ఆనందాన్ని తాను పొందుతున్నానన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రే జూనియర్ ప్రసాద్ లతోపాటు ప్రతి ఒక్కరూ డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు. రైతుల ఆరోగ్యాన్ని బాగు చేయాలన్న సంకల్పంతో రైతు టీవీ చేపట్టిన వైద్య శిబిరాలకు తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూడేరు తెలుగుదేశం మండల నాయకులు జల్లిపల్లి చంద్ర, ఉదిరిపికొండ తెలుగుదేశం నాయకులు మహేష్, భాష బిజెపి నాయకులు విరుపాక్షి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
వైద్యం వ్యాపారం కాకూడదు: డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి
