✍️ కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీ కి చెందిన మైథిలి అనే బాలిక , స్థానిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకుని రావాలని ఆ బాలిక తల్లి శనివారం సూచనలు చేస్తున్న క్రమంలో మనస్తాపానికి గురి అయిన ఆ బాలిక ఐరన్ మాత్రలు మింగి , అపస్మారక స్థితికి చేరుకుని,అనంతపురం లోని ఓ ఆస్పత్రి నందు చికిత్స పొందుతున్న క్రమంలో మృతి చెందిందని స్థానిక ఎస్ఐ లోకేష్ కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు…తల్లి తండ్రుల సూచనలు పాజిటివ్ గా తీసుకుని, మంచిగా చదివి, ఊహించని రీతిలో పలితాలు తెచ్చి, సమాజానికి ఆదర్శంగా ఉండాలే కానీ, ఇలా నెగెటివ్ థింక్స్ తో సున్నిత మైన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం సరి కాదని ఆయన ఈ సందర్భంగా యువతకు సూచించారు…ఆత్మహత్య లతో సమస్యలకు పరిష్కారం లభించదని, జీవితం లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించిన వ్యక్తి , అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చి గమ్యానికి చేరుకుంటారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు……
పరీక్షల ఒత్తిడితో విషాదం: తల్లి మందలించిందని మాత్రలు మింగిన పదో తరగతి విద్యార్థిని మృతి – ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదన్న
