Latest Posts

నల్లమాడలో ‘రైతన్న మీకోసం’: అన్నదాతల ఖాతాల్లోకి రూ. 6 వేల జమ – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో ప్రభుత్వం ప్రస్తుతం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత 6 వేల రూపాయలను రైతుల ఖాతాలో ఈనెల 13వ తేదీన జమ చేయడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో రైతన్న మీకోసం అనే కార్యక్రమంను వ్యవసాయ శాఖ చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు నల్లమాడ మండలంలోని సుబ్బరాయునిపల్లి, పులగంపల్లి మరియు దొన్నికోట గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పల్లె సింధూర రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇంకా మండల నాయకులు శంకర్ గారు మరియు సింగిల్ విండో అధ్యక్షుడు రమణారెడ్డి గారు, రైతులు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాల గురించి వివరించడం జరిగింది మరియు పంచసూత్ర ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇంకా పడని రైతులు ఎవరైనా ఉంటే సంబంధిత రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించి అందుకు గల కారణాలను తెలుసుకోగలరని వ్యవసాయ అధికారి గారు అబ్దుల్ గారు వివరించడం జరిగింది

Posted Under AP
Editor