Latest Posts

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం…

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం

రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

కూటమి ప్రభుత్వం తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ మండల కేంద్రంలోని హై స్కూల్ సమీపంలోని ముస్లిం కాలనీలో మైనార్టీ జిల్లా నాయకుడు సలాం ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ఏర్పాటుచేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని కొనియాడారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలో నిర్వహించి పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్నారు అల్లాదయతో రాష్ట్ర ప్రజలు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను కోరుకున్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ , ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. హిందువునైన తనకు 2014లో మైనార్టీ మంత్రిగా అల్లా దయతో చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. పేద ముస్లిం కుటుంబంలో వివాహం చేసుకున్న యువతికి ప్రభుత్వం లక్ష రూపాయలు దుల్వన్ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. అదేవిధంగా పేద ముస్లింలు హజ్ యాత్ర ,మక్కా మసీదు సందర్శనకు ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఆర్థిక సాయం కల్పించినట్లు తెలిపారు. మసీదుల మరమ్మతుల కోసం ఒకొక్క మసీదుకు 10 వేలు చొప్పున ప్రభుత్వం ద్వారా నిధులు ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ముస్లింల అభివృద్ధికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగను అత్యంత వైభవంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం పలువురు ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే మాజీ మంత్రి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మనోజ్ కుమార్ ఎంపీడీవో అంజనప్ప , టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ , టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు సోమశేఖర్ ,మండల టిడిపి కన్వీనర్ మైలే శంకర్ మాజీ కన్వీనర్ కేశవరెడ్డి ,సహకార సొసైటీ అధ్యక్షులు రమణారెడ్డి మైనార్టీ నాయకులు టిడిపి నాయకులు లక్ష్మయ్య డాక్టర్ బుట్టి నాగభూషణం ,పాపారాయుడు, గన్ రెడ్డి , మస్తాన్ వలి ,రమణ , ప్రసాద్ రెడ్డి ,మధు , గంగులప్ప , తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor