వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను, ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమం “రైతన్నా… మీ కోసం”. కార్యక్రమంలో భాగంగా .
ఈ రోజు కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గ్రామంలో “రైతన్నా… మీ కోసం” కార్యక్రమంలో పాల్గొని డోర్ టు డోర్ రైతుల ఇంటి వద్దకు వెళ్ళి అన్నదాత సుఖీభవ విడతల వారిగా డబ్బులు అందినాయ లేదా అని రైతులతో పలకరించి కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం హంద్రీనీవా నుండి నీటిని విడుదల చేసి ప్రతి చెరువులు నింపి పాడిపంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఇంకా రైతన్న పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారని కొనియాడారు.” ‘”అన్నదాత సుఖీభవ” కరపత్రాలను అంధజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు రూరల్ మండల ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతు సోదరులు రైతుhb సంఘం నాయకులు పాల్గొన్నారు.
” రైతే రాజు”, ” రైతే దేశానికి వెన్నెముక” లాంటి రైతన్నలకు ఎస్ 9 టీవీ తరపున శుభాభినందనలు.
