అపోలో వర్సిటీలో యూకే డిగ్రీ అవకాశాలు..

చిత్తూరు:

మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ మధ్య అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఇందులో భాగంగా శనివారం యూకే వర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ థాంప్సన్ రాబిన్సన్ అపోలో యూనివర్సిటీని సందర్శించి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్‌తో భేటీ అయ్యారు. రెండు వర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘2+1 అంతర్జాతీయ పాథ్‌వే’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు మొదటి రెండేళ్లు చిత్తూరులో, చివరి ఏడాది యూకేలో చదివి అంతర్జాతీయ డిగ్రీ పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీఈ కంప్యూటర్ సైన్స్, బీబీఏ కోర్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే డిజిటల్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సంయుక్త పరిశోధనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ భాగస్వామ్యం వల్ల స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Posted Under AP
Editor