అర్ధగిరి ఆలయానికి భారీ విరాళం…

పూతలపట్టు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి కొండ్రాజు కాలువ సర్పంచ్ దొడ్ల పరంధామనాయుడు భారీ విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ చొరవతో, ప్రతి నెలా సుమారు రూ. 75వేలు విలువైన నిత్య నైవేద్య సామగ్రిని రెండేళ్ల పాటు ఉచితంగా అందజేయాలని ఆయన నిర్ణయించారు. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రఘుపతి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, పాలకమండలి సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor