అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం
*నగరవనం పార్కు ప్రారంభానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే అమిలినేని*
*జలజీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీటి సరఫరా*
*పంచాయతి రాజ్ ద్వారా ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం చేపట్టండి..డిప్యూటీ సీఎంను కోరిన ఎమ్మెల్యే అమిలినేని*
*సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్*
*కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల కల నేడు నెరవేరబోతోంది పట్టణంలో అందరికి అందుబాటులో నగరవనం పార్కు రాబోతోంది ప్రజలందరూ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న పార్కు ప్రారంభానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయి వేయించి మంచి నీరు అందించాలని, ఎన్నో ఏళ్లుగా కనీసం రహదారులకు కూడా నోచుకోని గ్రామీణ రహదారులకు నిధులు అందించి ప్రతి గ్రామానికి మెరుగైన సౌకర్యం కల్పించాలని విన్నవించగా సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు అందజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు..*
