శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల గోపేపల్లి గ్రామం లో ఈరోజు ఉదయం 4:30 గంటల సమయంలో ముక్తాపురం వెంకటరెడ్డి అనే రైతు ఇంటి ముందర విద్యుత్తు లైన్ షార్ట్ సర్కిట్ వలన 30 స్ప్రింకర్ పైపులు మరియు డ్రిప్ లైడర్స్ అన్ని కాలిపోయినాయి ఈ ఇంటికి సంబంధించిన రైతు కదిరిలో వాళ్ళ కొడుకులు దగ్గర కి వెళ్ళినారు ఇంటిదగ్గర ఎవరూ లేని కారణం వలన ప్రమాదాన్ని బయట వ్యక్తులు గమనించే వరకు పైపులు సగం వరకు కాలిపోయినాయి తరువాత చూసిన స్థానికులు సబ్ స్టేషన్ కి ఫోన్ చేసి మెయిన్ లైన్ ఆపించడం జరిగింది ప్రమాద తీవ్రతను బట్టి సుమారు 35 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు
నల్లమాడ మండలం గోపేపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: రైతుకు భారీ ఆస్తి నష్టం
