ముదిగుబ్బ రూరల్ సిఐ ని కలిసిన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి !!
ముదిగుబ్బ ఫిబ్రవరి 4:- (YES 9 TV):-
ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ లో ముదిగుబ్బ మండల రూరల్ సిఐ సునీత ని తెలుగుదేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధికార ప్రతినిధి ముత్తుకూరు బిబి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. బేబీ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో అనేక గ్రామాల్లో శాంతి భద్రత ల పై ప్రతేక దృష్టి సారిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న తీరు అభినందనీయమని తెలిపారు. సర్కిల్ రూరల్ పరిధిలో ముదిగుబ్బ ,పట్నం ,తాడిమర్రి స్టేషన్ లను సమన్వయం చేస్తూ విధులు నిర్వహిస్తున్న మీ కర్తవ్య దక్షతను ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, గుర్తిస్తుందని తెలిపారు.
