Latest Posts

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా గోవిందు గంగులప్ప: నియామకంపై హర్షం, నేతలకు కృతజ్ఞతలు

బిజెపి కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడిగా గోవిందు గంగులప్ప నియామకం
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడిగా గోవిందు గంగులప్పను నియమించిన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబుకు, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌కు గోవిందు గంగులప్ప కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధితో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేవర రాము, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున, ఓబీసీ మండల ఉపాధ్యక్షుడు గొంగటి రమేష్, సదానంద్, ఆరవేటి ఆనంద్, చంద్ర, పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor