జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు మేటరేంటి?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్ని ఎవరో టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు మహిళా ఉద్యోగి, ఆయన ఫోన్ డేటాను సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరవ శ్రీధర్‌కి సంబంధించి మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది.
తన ప్రేమని గుర్తించాలంటూ ఓ మహిళా ఉద్యోగినికి ఆయన వీడియో కాల్ వ్యవహారం బయటకు వచ్చింది. అందులో శ్రీధర్.. కారులో బ్లేడుతో చేయి కోసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఆయన వైపు వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆయన మద్దతుదారులు షాకయ్యారు. ఈ వ్యవహారాన్ని వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ వీడియో బ్యాక్ డ్రాప్‌లో మజ్ను సినిమాలోని పాట యాడ్ చేశారు.
