- విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని MEO గారికి వినతి పత్రం ఇస్తున్న AISP నాయకులు.
- పెట్రోల్ బ్యాంకు అనుకోని స్కూల్ నడుపుతూ 1000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూన్న విద్యాశాఖ అధికారులు మరియు నారాయణ పాఠశాల సిబ్బంది.
- పెట్రోల్ బ్యాంకు అనుకోని నడుపుతున్న నారాయణ స్కూల్ పై ఎందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు ?.
- వచ్చే విద్య సంవత్సరంలో ఉండే అడ్మిషన్స్ పోకుండా ఉండాలని వచ్చే సంవత్సరం పీజు ఇప్పుడే చెల్లించాలి.ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి.
- చర్యలు తీసుకొని పాఠశాలను వేరొకచోటుకు మార్చే వరకు పోరాటం చేస్తాం.
ఈ సందర్భంగా AISP జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వీ , నియోజకవర్గ కార్యదర్శి అభి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పెట్రోల్ బంక్ ఆనుకొని ఉన్నది.కనీసం 100 మీటర్ల దూరం కూడా లేదు. పెట్రోల్ బంక్ పక్కన నారాయణ పాఠశాల ఉండడంవల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వందలాదిమంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి.విద్యార్థుల ప్రాణులతో చెలగాటం ఆడుతున్న నారాయణ పాఠశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నారాయణ పాఠశాల వారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సెలవు రోజుల్లో స్కూల్ నడుపుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. దానిపై గతంలో అనేకమార్లు విద్యశాఖ అధికారులకు తెలియచేయడం జరిగింది.దాంతో పాటు సెలవు రోజులలో స్పెషల్ క్లాస్ పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వల్ల వారిని మానసికంగా ఇబ్బంది పెట్టినట్లు అని కావున భవిష్యత్తులో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించకూడదని నారాయణ పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి పాఠశాల వారు విద్యార్థుల నుండి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఫీజులు పట్టికను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి.కానీ వారు వేలకు వేలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు.కానీ నోటీస్ బోర్డులో ఫీజులు పట్టికను ప్రదర్శించలేదు. అదేవిధంగా నారాయణ పాఠశాల పెట్రోల్ బంక్ అనుకొని ఉందని గతంలో విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశాము. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల ప్రాణాలతో చల్లగాటం ఆడుతున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.ఒకవేళ చర్యలు తీసుకోని యడల విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్య శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణము అవుతాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.అదేవిధంగా విద్య సంవత్సరం కాక ముందే long-term కోచింగ్ పేరుతో అక్రమ అడ్మిషన్ చేస్తున్నారు.అలానే మీ పిల్లలు పై తరగతులు ప్రమోట్ మరియు పిజులో రాయితీ కావాలంటే పుస్తలు మరియు దుస్తులు ఇప్పుడు కొంటే అని లేకుంటే మీకు ఫీజు ఎక్కువ కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి విద్యా సంవత్సరం పూర్తి కాకని వచ్చే విద్యా సంవత్సరానికి ఇలా ఫీజులు వసూలు చేయడానికి కూడా అపాలని కోరుతున్నాము.కావున ఇప్పటికైనా నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోని యడల దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము.
