బద్వేల్లో టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్.. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిక!
కడప జిల్లా బద్వేల్లో రాజకీయంగా మరోసారి మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు హితవు పలికారు. నామినేషన్ల నుంచి ఓటింగ్ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. గెలుపోటములను నిర్ణయించేది నాయకులు కాదని, ప్రజలేనని స్పష్టం చేస్తూ టీడీపీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు.
