Latest Posts

ముదిగుబ్బ ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్లు ఆవిష్కరణ…

ముదిగుబ్బ జనవరి 1: (YES 9 TV) ముదిగుబ్బ ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్లు ఆవిష్కరణ

ముదిగుబ్బ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ లను ఆవిష్కరించడం జరిగిందని ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కృష్టం మహేష్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీ వాసవి మాత ఆశీస్సులతో క్యాలెండర్లను ఆవిష్కరించడం జరుగుతోందని తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ క్యాలెండర్ ను ఆవిష్కరించినట్లు మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు హరినాథ్, సూర్యనారాయణ, జనార్ధన గుప్తా ( బాబు) డిష్ వెంకటేశ్వర్లు, ఆనంద్, రామయ్య, నాగరాజు, పుల్లయ్య, చంద్ర, మహిళా మండలి సభ్యులు సునీత, సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor