Latest Posts

CCC ఆర్డిటి వైద్య, విద్య సేవలు సెప్టెంబరు 30 వ తేదీ నుంచి మూతపడే సంకేతాలు…

# శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన తీవ్రమైన ప్రయత్నం కూడా ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో నత్తనడకగా సాగుతున్న వ్యవహారం.

 

# అనేక స్వచ్ఛంద సంస్థలు సేవ్ ఆర్డిటి అంటూ చేసిన నిరసనలు తూతూ మంత్రంగానే ఉండడంతో FCRA అనుమతిగూడ నర్తనడకలా సాగుతోంది.

 

# రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని కలిసి కొంతమంది పుర ప్రముఖులు వినతి పత్రం సమర్పించాలని ప్రయత్నిస్తున్నారు.

 

# వేలాది లక్షలాది ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసే ప్రముఖ పార్టీలు ఆర్డిటికీ ఏ రకమైన ఇబ్బంది కలిగిన వేలాది లక్షలాదిమంది ప్రభుత్వాలకు వ్యతిరేకమవుతారు అన్న విషయం గమనించాలని సామాన్య ప్రజల భావన.

 

# త్వరలో జరిగే సంస్థాగత ఎన్నికలలో ఆర్డిటి ప్రభావం లేకుండా చూసుకోవడం ఎంతైనా ఉందని తెలుగుదేశం కార్యకర్తలు సైతం తన భావం లో వ్యక్తం చేశారు.

 

# ఆర్ డి టి సమస్యను జిల్లా సమస్యగా భావించకుండా రాష్ట్ర సమస్యగా గుర్తించి త్వరితగతిలో సమస్య పరిష్కాపరిష్కారానికి ప్రభుత్వానికి శ్రీ లోకేష్ గారికి విన్నపం.

 

# RDT సంస్థ కార్యాలయాలు ఉన్న జిల్లాలోనే ఆరోగ్య మంత్రిగా ఉండి వైద్య సేవలు నిలిచి వేసినట్లయితే ప్రజలు ఏ రకంగా దీనిని సమ్మతిస్తారు ఆలోచించాలి.

ఈ లిఖిత వార్తను ఆరోపణ పరంగా ఆలోచించకుండా జిల్లా అభివృద్ధికి సూచన ప్రాయ విన్నపంగా భావించి వెంటనే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు RDT కి ఎఫ్ సి ఆర్ ఏ అనుమతించాలని మనవి.

Posted Under AP
Editor