2025 జులై-ఆగస్టు విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు యూనివర్సిటీలు, కాలేజీలు ఇకపై ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ ఎడ్యుకేషన్ విధానాల్లో అడ్మిషన్లు చేపట్టరాదని యూజీసీ తన ప్రకటనలో తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థలపై నేరుగా ప్రభావం పడనుంది.
ఈ నిషేధం కిందకు వచ్చే కోర్సుల జాబితాను కూడా యూజీసీ వెల్లడించింది. సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి కోర్సులను ఇకపై దూరవిద్య ద్వారా అభ్యసించే అవకాశం ఉండదు. ఈ కోర్సులు విద్యార్థుల్లో బాగా ప్రాచుర్యం పొందినవి కావడంతో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
జులై 23న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు యూజీసీ వివరించింది…
