Yes. 9.tv యాడికి
యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో ముల్లా అబ్దుల్ సాబ్ (102) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు మృతి చెందాడు… ఈ వృద్ధుడు 100 సంవత్సరాలు దాటినా అలవోకగా తన పనులు తాను చేసుకునేవాడని, కొలిమి పనితో పాటు కార్పెంటర్ పని కూడా చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఆ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారము అనగా రాగి ముద్ద, జొన్న సంగటి, సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు మొదలగు పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవడం వలనే ఇన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు…
