Yes. 9Tv
తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి బుధవారం
యాడికి మండలంలో పర్యటించినారు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న నీటి సంపును పరిశీలించి అధికారులతో ,వాటర్ మ్యాన్ లతో తాగునీటి సరఫరా అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా పైప్ లైన్లను జనవరిలోపు సరిచేసి ఉంచాలన్నారు. కొండమీద ఉన్న ట్యాంకులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసినారు హాస్పటల్ కాలనీ, చౌడేశ్వరి కాలనీలలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉండడంతో ఆయా కాలనీలలో పర్యటించి డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి ఆపరిశుభ్రంగా ఉండడంతో వైద్యులపై అసంతృప్తి వెళ్ళబుచ్చినారు నేను మరొకసారి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆసుపత్రి అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ,మండల స్థాయి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జె.సి. అభిమానులు పాల్గొన్నారు
