తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో అదనంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు ఆరోగ్య శ్రీలో అందుబాటులో ఉన్న 1,375 విధానాలకు ఫ్యాకేజీ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలకు సంబంధించి రూ. 497.29 కోట్లు విడుదల చేస్తూ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం క్రింద యోంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
