తెలంగాణలో మాజీ మంత్రి అరెస్ట్ – కోమటిరెడ్డి..!!

తెలంగాణలో ఎంపీ ఎన్నికల రాజకీయం వేడెక్కతోంది. కేసీఆర్ ప్రచార సభల్లో సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. 15 ఎంపీ స్థానాల్లో గెలవాలని సీఎం రేవంత్ లక్ష్యంగా నిర్ణయించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. బీజేపీ ఈ సారి మెజార్టీ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. దీంతో, త్రిముఖ పోరు కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ లక్ష్యంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి కైంటర్ గా మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ టచ్ చేస్తే పునాదులు కూల్చేస్తామని హెచ్చరించారు. రేవంత్ ను చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. మెదక్ లో వెయ్య కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవదని పేర్కొన్నారు. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ 15 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

 

కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలనr మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేసారు. అలాగే, మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్‌ గెలవలేదని జోస్యం చెప్పారు. ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరు కూడా మిగలరని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందన్నారు.

 

కేసీఆర్‌ కూతురు అవినీతి చేసి తీహార్‌ జైలులో ఉన్నారన్నారు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు.జగదీష్‌ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. శంషాబాద్‌లో ఫామ్‌ హౌస్‌ కూడా కొన్నారని చెప్పారు. జగదీష్‌ రెడ్డి అవినీతిని బయటకు తీస్తామన్నారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Editor