Latest Posts

315 కోట్ల అవినీతి కేసు.. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సీబీఐ కేసు..

ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి మెఘా ఇంజినీరింగ్ కు చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో సుమారు రూ. 78 లక్షల లంచం తీసుకున్నందుకు ఎన్ఐఎస్పీ, ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్ కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

 

ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఇంటిగ్రేటెడ్ లోని ఇంటెక్ వెల్, పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్ లైన్ పనులకు సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్టులో లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సీబీఐ ఆగస్టు 10, 2023న ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా అవినీతి ఆరోపణలపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేసింది.

 

ఈ కేసులో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాష్, డైరెక్టర్ ప్రొడక్షన్ డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం(ఫైనాన్స్) ఎల్ కృష్ణమెహన్, 73.85 లక్షల లంచం తీసుకున్న కే రాజశేఖర్, సోమనాథ్ ఘోష్(మేనేజర్ ఫైనాన్స్) పేర్లను చేర్చింది.

 

సుభాష్ నుంచి 73 ఇన్వాయిస్ లకు వ్యతిరేకంగా ఎన్ఎండీసీ లిమిటెడ్ కు రూ. 174.41 కోట్లను మెఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) చెల్లించినందుకు రూ. 5.01 లక్షల లంచం తీసుకున్నారని ఆరోపణలున్న మెకాన్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు అధికారులను ఏజీఎం కాంట్రాక్టులు సంజీవ్ సహాయ్, డీజీఎం కాంట్రాక్టులు కే ఇల్లవర్సు పేర్లను ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు. ఈ కేసులో ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ చంద్ర సంగ్రాస్, మెగా ఇంజినీరింగ్ లను కూడా నిందితులుగా చేర్చారు.

 

ఇది ఇలావుండగా, మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. మెఘా ఇంజినీరింగ్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండవస్థానంలో నిలిచింది. అత్యధికంగా దాదాపు రూ. 586 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రూ. 195 కోట్లు, డీఎంకేకు రూ. 85 కోట్లు, వైయస్సార్సీపీకి రూ. 37 కోట్లు, టీడీపీకి దాదాపు రూ. 25 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 17 కోట్లు, జేడీఎస్, జనసేన, జేడీయూలకు రూ. 5 నుంచి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చింది.

Editor