Latest Posts

నాగ చైతన్యపై సమంత షాకింగ్ పోస్ట్…

సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. అయితే ఇటీవల వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

 

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఇటీవలే ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ”హనీ, బన్నీ” పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమాలో సమంతకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్టు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేయడానికి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అట్లీ వినిపించిన కథ నచ్చడంతో వెంటనే సమంత ఈ సినిమాను ఓకే చేసిందట.

 

ఇదిలా ఉంటే హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. విడాకుల తరువాత తొలిసారి వీరిద్దరు కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్‌లో భాగమైన నటీనటులను సాంకేతిక నిపుణులను ఈ ఈవెంట్‌కు హాజరయ్యేలా చేసింది

 

సమంత ,నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ప్రమోషన్ ఈవెంట్‌లో భాగమయ్యారు .వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. నువ్వు లేకుండా నేనేం చేయగలను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో నాగ చైతన్య , సమంతలు తిరిగి కలుసుకోబోతున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Editor